calender_icon.png 14 October, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత విప్లవోద్యమానికి వేణుగోపాల్ ద్రోహం

14-10-2025 12:49:22 AM

  1. ఆయన ఆలోచనలు మార్చుకోవాలి
  2. సికాస కార్యదర్శి అశోక్  

పెద్దపల్లి, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): భారత విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారి ద్రోహం తలపెడుతున్న వేణుగోపాల్ ఆలోచనలు మార్చుకోవాలని సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇన్నాళ్లు విప్లవ ముసుగు కప్పుకొని వాస్తవాలను వక్రబుద్ధితో వక్రీకరిస్తూ చరిత్రను తలకిందులుగా చూపడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.

సికాస ప్రారంభమైన 1982 నుంచి కార్మికోద్యమం భారతదేశంలో అన్ని బొగ్గు గనుల ఉద్యమాలకు ఆదర్శమైందన్నారు. పోరాటాలు, త్యాగాలు లేనిదే హక్కులు సాధించలేమనేది సింగరేణి కార్మికుల జీవితాల్లో నిలిచిందన్నారు. సింగరేణి కార్మికుల పోరాట చరిత్ర వేణుగోపాల్‌కి తెలియనిది కాదని తెలిపారు. మార్క్స్ సిద్ధాంతం నుంచి కర్మ సిద్ధాంతంలోకి జారుకున్నాడని ఆరోపించారు.

గత సంవత్సరం కాలంగా ఆయనలో మొదలైన తిరోగమనల ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మెల్లమెల్లగా ఒక గుంపును పోగు చేసుకుంటున్నాడని విమర్శించారు. జీనుగు నరసింహారెడ్డి లాంటి ఒకరిద్దరిని ఏజెంట్లుగా పెట్టుకొని తేనె పూసిన కత్తిలాగా పని సాగించాడని అశోక్ పేర్కొన్నారు. సికాస తరఫున చికాగో అమరుల రక్తంతో మొదలైన ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ కార్మికుల హక్కుల సాధనలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.