calender_icon.png 14 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష దేశీ గోవులతో గో మహాధామం ఏర్పాటు చేయండి

14-10-2025 12:16:49 AM

  1. శ్రీవారి కైంకర్యాలకు దేశీ గోవుల పాల ఉత్పత్తులనే వాడండి
  2. టీటీడీ మాజీ సభ్యుడు, యుగ తులసీ ఫౌండేషన్ చైర్మన్ కే శివకుమార్
  3. గో మహా ధామం నివేదికలను అధికారులకు, జగద్గురుస్వామివారికి అందజేత

హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవారికి లక్ష దేశీ గోవులతో గోవిందునికి గో మహా ధామం (స్వంత డెయిరీ)ని నిర్మించాలని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, యుగ తులసీ ఫౌండేషన్ చైర్మన్ కె.శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేర కు సోమవారం ఆయన తాను రూపొందించిన గో మహా ధామం నివేదికను టీటీడీ అధికారులకి అందజేశారు.

ఆనంద నిలయం లో శ్రీవారికి సమర్పించే నిత్య నైవేద్యాలు, కైంకర్యాలు, లడ్డూ మహా ప్రసాదం తయారీలో సనాతన ధర్మానికి, శాస్త్ర ప్రమాణాలకు విరుద్దంగా సంకరజాతి క్రాస్ బ్రీడ్ జంతువు పాల నుంచి వచ్చిన నెయ్యిని వినియోగించడం తక్షణం ఆపాలని విజ్ఞప్తి చేశారు. దేశీ గోవుల పాల నుంచి తయారైన నెయ్యిని వినియోగించాలని యుగ తులసీ ఫౌండేషన్ ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు.

ఇదే విషయంపైన 2021 లో టీటీడీ నియమించిన నిపుణులతో కూడి న కమిటీ నివేదిక సమర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో పాటు ఇతర ప్రజాప్రతినిధులందరికీ వినతిపత్రాలు అందజేసినట్లు శివకుమార్ పేర్కొన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో వికేంద్రీకరణ విధానంలో రోజుకి ౫ లక్షల దేశీ ఆవు పాలు, ౧౬ టన్నుల దేశీ ఆవు ఉత్పతి లక్ష్యంగా విడతకు యాభై వేల చొప్పున రెండు విడతల్లో లక్ష దేశీ గోవులను వితరణ చేసి నెయ్యి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవచ్చున న్నారు.

కొండ మీద ౭౦ గోవుల చొప్పున మొత్తం ౫౦౦ గోవులతో సప్త గిరుల పేరుతో సప్త గో మహా ధామాలు నిర్మించి ఆనంద నిలయంలో స్వామివారి అభిషేకాలకు, నిత్య నైవేద్యాలకు, కైంకర్యాలకు రసాయనాలు కలిపి నిల్వ చేయని పాలు, ముందు రోజు తీసిన వెన్న కాకుండా అప్పుడే తీసిన స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు, వెన్న, నెయ్యి పాల ఉత్పత్తులు అందించడానికి గల అవకాశాలను ఈ సమగ్ర నివేదికలో విపులంగా, వివరంగా ప్రతిపాదించామన్నారు.

ఈ నివేది కలను పరిశీలించి గో మహా ధామం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా టీటీడీ మాజీ సభ్యుడు శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు.అలాగే టీటీడీ లక్ష దేశీ గోవుల మహాధామం నిర్మా ణం కోసం రూపొందించిన నివేదికలను టీటీడీ జేఈవో గౌతమి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి, జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారికి ఆయన వేర్వేరుగా అందజేశారు.