14-10-2025 12:26:57 AM
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): గత ఆగస్టు నెలలో తల్లీ, కొడుకుల ను కిడ్నాప్ చేసి, చంపుతామని బెదిరించి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న నిందితులపై బాధితు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాదితురాలు, పట్టాదారు పాలాది కళావతి, మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలం పాలకొండ శివా రులోని సర్వేనెం.272లో పాలాది కళావతికి భూమి ఉన్నది.
వాటిని కాజేసేందుకు చలువగాలి రాఘవేందర్ రాజు, అతని డ్రైవర్ శి వశంకర్‌గౌడ్, గోక నరేందర్, సామశివలిం గం, సురేష్‌లతోపాటు, 30మంది రౌడీలు కుట్రలు చేశారు. అక్కడితో ఆగకుండా కళావతి, ఆమె కుమారుడిపై 6 అక్రమ కేసులు నమోదు చేయించాడు. వాటిపై హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ తీసుకున్నా రు.
బెయిల్ షరతుల ప్రకారం కళావతి, ఆ మె కుమారులు ఆగస్టు 4న మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంత కాలు పెట్టి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా మయూరి ఏకో పార్క్ దగ్గర రహదారిపై తన రౌడీలతో కాపు కాసిన చలువగాలి రా ఘవేందర్ రాజు.. వీరి వాహనాన్ని అడ్డగించి కళావతిని, ఆమె కుమారులను వేర్వేరు వా హనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కళావతిని తాటికొండ గ్రామంలో ఉన్న రాఘవేందర్ రాజు ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు.
ఆమె కుమారులను వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. వృద్ధురాలు అనికూడా చూడకుండా కళావతిని, ఆ మె కుమారులను చిత్రహింసలు పెట్టి రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే నీకుమారులను నా రౌడీ లు చంపేస్తారని రాఘవేందర్ రాజు భయపెట్టాడు. ఆమె కుమారుల మెడపై కత్తిపెట్టిన వీడియోను చూపించి భయపెట్టాడు.
ఆ తర్వాత కళావతిని అక్కడి నుంచి మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని కి రాఘవేందర్ రాజు వాహనంలో తీసుకెళ్లి రాఘవేందర్ రాజు పేరున 3.-05ఎకరాలు, మరో వ్యక్తి గోక నరేందర్ పేరున -27 గుంట ల భూమిని ఒక్కపైసా ఇవ్వకుండా అక్రమం గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడి నుంచి కళావతిని రాఘవేందర్ రాజు ఫాంహౌసుకు తీసుకెళ్లారు. ఆమె నాకుమారులను కూడా అక్కడికి తీసుకువచ్చి రాత్రి 8గంటల వరకు చిత్రహింసలు పెట్టారు.
ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్పినా, ఎవ్వరికైనా ఫిర్యాదు చేసినా అందర్ని చంపేస్తామంటూ, తీవ్రస్థాయిలో హెచ్చరించి వదిలేశారు. ఆ వెంటనే వారు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని హైదరాబాద్ వెళ్లి 100కి కాల్ చేశారు. ఆ తరువాతి రోజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఆది వారం మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై విజయ్‌కుమార్.. చలువగాలి రాఘవేందర్ రాజు, అత డి అనుచరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆ తర్వాత కిడ్నాప్, అక్రమ రిజిస్ట్రేషన్‌పై సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఆగస్టు 5వ తేదీన విజయక్రాం తి దినపత్రిక ఎండి సీఎల్ రాజంను బాధిత కుటుంబ సభ్యులు కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా విజయక్రాంతి దినపత్రిక ’బరితెగింపు భూదందా’ అనే కథనం ప్రచురితం చేసింది. పూర్తి దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చెపుతున్నారు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
బాలాజీ కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాఘవేందర్ రాజుతో మరో 30 మందిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఎఆర్ నెం: 731/2025 వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 126, 137(2), 115(2), 127(2), 351(2), 352, r/w 3, r/w 5 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద ఎస్సై విజయ్‌కుమార్ కేసు న మోదు చేశారు. అయితే న్యాయం గెలుస్తుందంటూ సోమవారం సోషల్ మీడియాలో ఆ ఎఫ్‌ఆర్ ప్రతిని రాఘవేందర్ రాజు పోస్టు చేశాడు. పట్టణంలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. కాగా కేసు లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.
పాలకొండ భూముల్ని కొనొద్దు
మమ్మల్ని కిడ్నాప్ చేసి, చిత్రహింసలుపెట్టి, భయపెట్టి ఒక్కపైసా ఇవ్వకుం డా పాలికొండ గ్రామ శివారులోని సర్వే నెం.272లో రాఘవేందర్ రాజు, అతడి రౌడీలు రిజిస్ట్రేషన్ చేసుకొన్న భూము ల్ని ఎవ్వరు కొనొద్దు. ఎందుకంటే వాటి పై మేము హైకోర్టులో కేసులు వేశాం. నేను లీగల్‌గా వెళతానని గొప్పలు చెప్పే చలువగాలి రాఘవేందర్ రాజు ఇల్లీగల్ పనులు చేస్తూ, అందర్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, మాలాంటి అమాయకుల భూ ముల్ని లాక్కొంటూ కోట్ల కూడుగట్టుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గుడికి న్యాయపరంగాగా బుద్ధిచెప్పి జైల్లో చి ప్పకూడు తినిపించి, గుణపాఠం చెపుతాను.
పాలాది కళావతి, పట్టాదారురాలు