calender_icon.png 3 July, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షం వస్తే సరి.. కేశవనగర్ కాలనీ బురదమయం

02-07-2025 07:15:10 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Toopran Municipality)లోని 16వ వార్డు కేశవనగర్ వర్షాకాలం వచ్చిందంటే సరి సీసీ రోడ్డు పూర్తిగా చిత్తడి చిత్తడిగా తయారవుతుంది. గత మూడు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొంటుందని కాలనీ వాసులు పేర్కొన్నారు. గతంలో ప్రజా ప్రతినిధులు ఉన్న పట్టించుకున్న పాపాన పోలేదు, రోడ్డు మరమ్మత్తులను ఏనాడు చేపట్టలేదు. దీని ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బైకులపై వస్తున్న వాహనదారులు బురద ఏర్పడడంతో జారీ కింది పడిపోవడం సంభవిస్తుందని తెలిపారు. గతంలో ప్రజా ప్రతినిధులతో, అధికారులతో చెప్పినా మాత్రం పట్టించుకుని మరమ్మత్తులు చేసే దాఖలాలు లేవని కాలనీవాసులు తెలిపారు.