calender_icon.png 3 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

02-07-2025 07:11:47 PM

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): వైద్యులు దైవంతో సమానమని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి(Rotary Club Assistant Governor Jaipal Reddy) అన్నారు. బుధవారం రోటరీ ఆడిటోరియంలో 25 మంది వైద్యులను ఘనంగా సన్మానించారు. వైద్య వృత్తి దేవునితో సమానమని అన్నారు. ప్రాణాలను కాపాడే వారు వైద్యులు దైవంతో సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి చంద్రశేఖర్, రమణ, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎం జైపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ శంకర్, సెక్రెటరీ  సబ్బాని కృష్ణ హరి, ట్రెజరర్ పి వెంకటరమణ, ప్రోగ్రాం చైర్మన్ వెంకట్రాజం, శ్రీశైలం, డాక్టర్ బాలరాజు, డాక్టర్ రవీందర్ రెడ్డి, పున్నరాజేష్, రాజనర్సింహారెడ్డి, అయిత బాలకిషన్, ఇతర రొటేరియన్స్, తదితరులు పాల్గొన్నారు.