07-09-2025 01:28:10 AM
-గోవా సెమినార్‌లో వరంగల్ ఎంపీ కడియం కావ్య
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో మహిళలను డిజిటల్ అసమానతలు త్రీవంగా ప్రభావితం చేస్తున్నాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. గోవాలో శనివారం నిర్వహించిన మహిళా నాయకుల సెమినార్ ఆమె పాల్గొని మాట్లాడారు. సమ్మిళిత వృద్ధి లక్ష్యం దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో పురుషుల కంటే మహిళలు 8 శాతం తక్కువగా మొబైల్ ఫోన్లను కలిగి ఉన్నారని ఆమె వివరించారు.
దక్షిణాసియా, సబ్ -సహారా, ఆఫ్రికా వంటి ప్రాంతాలు విస్తృతమైన డిజిటల్ అంతరాలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. భారతదేశంలో 85 శాతం మంది పురుషులకు మొబైల్ ఫోన్లు ఉండగా 75 శాతం మంది మహిళలు మాత్రమే మొబైళ్లను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఈ అంశంలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో స్వల్ప పురోగతి ఉందన్నారు. డిజిటల్ అసమానతలు.. వ్యక్తిగత, సామాజిక పురోగతికి ఆటంకం కలిగి స్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.