13-01-2026 02:42:29 AM
పేదల, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు
ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత భవనాల నిర్మాణం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మేడ్చల్, జనవరి 12(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలో ఎస్. ఎస్. ఆర్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు సౌకర్యం, పరిపాలన కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణా లతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ను రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో రెండో విడతలో జిల్లా కేంద్రా ల్లో మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాలలో సమీకృత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్స్‌తోనే ఈ 12 సమీకృత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కొత్తగా పెళ్లయి రిజిస్ట్రేషన్ కు వచ్చే జంటలు, చిన్న పిల్లలతో వచ్చే తల్లు లు, పేదలకు సకల సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదా య వనరుగా కాకుండా సేవా కేంద్రంగా చూ స్తోందని స్పష్టం చేశారు. పేదలకు గతంలో ఇచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని, ఈవిషయంలో ఉక్కుపా దంతో అక్రమాలను అణచివేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలతో విమర్శించుకునే పరిస్ధితి రాకుండా పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తుందని స్ఫష్టం చేశారు.
పేదల భూములను రక్షించాలి: ఎంపీ ఈటల రాజేందర్
పేదల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, వారి భూములను రక్షించాలని ఎం పీ ఈటెల రాజేందర్ అన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పేదల భూముల్లో బాగా వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ స్టేష న్లు సివిల్ తగాదాలకు అడ్డా కాకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రాజీవ్‌గాంధీ హనుమంత్, మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ ఛైర్మన్ నర్సిం హులు యాదవ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఆర్టిఎ కమీషన్ సభ్యులు జైపాల్‌రెడ్డి, డిఎస్‌ఆర్ నిర్మాణ సంస్ధ అధినేత సుధాకరరెడ్డి పాల్గొన్నారు.