calender_icon.png 8 May, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ గంగారం విద్యార్థుల ప్రభంజనం

23-04-2025 12:03:06 PM

ఇంటర్ ఫలితాల్లో టాప్ ర్యాంక్ లు 

మహబూబాబాద్,(విజయక్రాంతి): 2025 ఇంటర్మీడియట్ ఫలితాల్లో(TS Inter Result 2025) మహబూబాబాద్ జిల్లా గంగారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులై ప్రతిభను చాటారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వి.ఐశ్వర్య బైపీసీ విభాగంలో 972/1000 మార్కులతో ఉత్తీర్ణురాలై రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. ఎంపీసీ విభాగంలో వి.భార్గవి 944/1000 మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది. అలాగే ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ భాగంలో ఇదే కళాశాలకు చెందిన పి. జోష్ణ 427/470, బైపీసీ విభాగంలో ఎం.సంజన 403/440 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అలాగే డోర్నకల్ కేజీబీవీ కళాశాలకు చెందిన ఎస్.కావేరి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీఈసీ విభాగంలో 448/500 మార్కులు సాధించగా, ఎంపీహెచ్ విభాగంలో గార్ల కేజీబీవీకి చెందిన ఎస్. రాజేశ్వరి 488/500 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.

ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎం పి హెచ్ విభాగంలో ఇదే కళాశాలకు చెందిన పి.సత్య వేద 916/1000 మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది. డోర్నకల్ కేజీబీవీకి చెందిన ఎన్.అంకిత సిఇసి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 913/1000 మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది. అత్యున్నత మార్కులు సాధించి రాష్ట్ర, జిల్లా ర్యాంకులు సాధించిన కేజీబీవీ కళాశాలల విద్యార్థులను జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి అభినందించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కేజీబీవీ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 244 మంది హాజరుకాగా 174 మంది ఉత్తీర్ణులు అయ్యారని, అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 239 మంది హాజరుకాగా 206 మంది ఉత్తీర్ణులయ్యారని డిఇఓ తెలిపారు.