27-09-2025 01:27:50 AM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడం పల్లి గ్రామపంచాయతీలో ఉన్న సదరమాట్ ఆనకట్ట వద్ద ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉన్నందున శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం శుక్రవారం సదర్ మాట్ ఆనకట్ట వద్ద ప్రవాహం జోరు మీద ఉన్నది. ప్రవాహ తాకిడికి ఆనకట్ట రెండు గేట్లు కొట్టుకుపోయి కాలువలోనికి భారీగా వరద నీరు రావడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వెంటనే అధికారులతో మాట్లాడి గేట్ల మరమ్మత్తు త్వరగా చేయాలని ఆదేశించారు. పరివాహక ప్రాంతంలో తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు.