27-09-2025 01:28:52 AM
ఆడి పాడి అలరించిన మహిళ వైద్య బృందం
వాజేడు సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): వాజేడు మండల కేంద్రంలో గల ప్రాథమిక వైద్యశాల ఆవరణంలో శుక్రవారం వైద్య బృందం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. భక్తి శ్రద్దలతో ధూప దీపాలతో బతుకమ్మను అలంకరించి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల పరిధిలో గల ఆశా వర్కర్లు, స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.