calender_icon.png 2 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా బిజీ బిజీ

02-01-2026 12:00:00 AM

  1. కొత్త ఏడాదిలో క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే
  2. భారత్‌కు తీరికలేని షెడ్యూల్

* కొత్త ఏడాది వచ్చేసింది... 2026 క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కు ఇవ్వబోతోంది.. వరల్డ్‌కప్ నుంచి ఆసియా గేమ్స్ వరకూ టీమిండియా తీరికలేని షెడ్యూల్‌తో, మేజర్ టోర్నీలతో బిజీబిజీగా గడపబోతోంది. న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి మొదలుకానున్న భారత జట్టు బిజీ షెడ్యూల్ ఏడాది మొత్తం ప్యాక్ అయిపోయింది. ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్, తర్వాత ఐపీఎల్ , ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్... ఏడాది చివర్లో ఏషియన్ గేమ్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌తో అటు అభిమానులకు కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం.

ముంబై, జనవరి 1 : భారత క్రికెట్ జట్టు ఎప్పుడూ బిజీనే... విరామం లేకుం డా వరుస సిరీస్‌లు ఆడుతూనే ఉంటుంది. ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్.. ఇలా ఏడాది పొడవునూ తీరిక లేకుం డా మ్యాచ్‌లు ఉంటాయి. క్రికెట్ క్రేజ్ దేశం కావడంతో ఇటు స్వదేశంలోనూ, అటు విదేశాల్లోనూ భారత్ ఆడే సిరీస్‌లకు విపరీతమై న ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఈ బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లకు కూడా చిరాకు వస్తుంటుంది. ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ భారత క్రికెట్ జట్టు ఊపిరిసలపని షెడ్యూల్‌తో గడపబోతోంది.

సౌతా ఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత మూడు వారాలు విశ్రాంతి దొరకడంతో కాస్త రిలా క్స్ అవుతున్న మన క్రికెటర్లు వచ్చే వారం తర్వాత అస్సలు ఖాళీ లేకుండా క్రికెట్ ఆడబోతున్నారు. టీమిండియా 2026 షెడ్యూ ల్ చూస్తే జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లతో కొత్త ఏడాదిలో వాళ్ల క్రికెట్ జర్నీ మొదలుకాబోతోంది. కివీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడిన వారం రోజులకే టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉంటుంది. ఈ మెగాటోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి.

డిఫెండింగ్ చాంపియన్ కావడం, సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌లో అసలు భారత్‌కు ఎదురే లేకుండా పోయింది. ఆడిన ప్రతీ సిరీస్ గెలుచుకుంటూ వచ్చింది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్, ఆసీస్ టూర్‌లోనూ, ఇటీవల సౌతాఫ్రికాపైనా మెన్ ఇన్ బ్లూ జయకేతనం ఎగరవేసింది.

ఇప్పుడు అదే జోష్‌తో మరోసారి వరల్డ్‌కప్ నిలబెట్టుకోవాల ని పట్టుదలగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బలమైన జట్టు నే సెలక్టర్లు ఎంపిక చేయడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఉపఖండపు పరిస్థితులను అడ్వాంటేజ్‌గా తీసుకుని టీమిండియా దుమ్మురేపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే వారం రోజుల వ్యవధిలో భారత ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆడబోతున్నారు. ప్రపం చక్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ అందరికీ తెలుసు. సమ్మ ర్ హాలిడేస్ కావడంతో స్టేడియాలన్నీ హౌస్‌ఫుల్ అయిపోతుంటాయి. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రతీరోజూ సాయంత్రం టీ20 మజాతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్ బరిలో ఉంటారు. దీంతో నాన్‌స్టాప్ టీ20 క్రికెట్‌తో అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం.

ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో హోం సిరీస్ ఆడుతుంది. ఒక టెస్ట్, మూడు వన్డేలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్ బీసీ సీఐ ప్రకటించాల్సి ఉంది. జూలైలో ఇంగ్లాం డ్ టూర్‌కు వెళుతుంది. గత ఏడాది రెడ్‌బాల్ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఐదు టెస్టు లు ఆడి 2-2తో సమం చేసిన భారత్ ఇంగ్లీ ష్ గడ్డపై ఈ సారి వైట్‌బాల్ సిరీస్‌లు ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇం గ్లాండ్‌తో తలపడుతుంది. ఇంగ్లీష్ పిచ్‌లు మరోసారి భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నాయి.

అలాగే ఆగష్టులో భారత్ శ్రీలం క పర్యటనకు వెళ్ళి రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం వాయిదా పడిన బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. బంగ్లాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. సెప్టెంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్, వెస్టిండీస్‌తో సొంతగ డ్డపై వైట్‌బాల్ సిరీస్‌లు షెడ్యూల్‌లో ఉన్నా యి. అదే సమయంలో జపాన్ వేదికగా ఆసియాగేమ్స్ జరగబోతున్నాయి. ఆసియాక్రీడల్లో క్రికెట్ కూడా భాగం కావడంతో భారత జట్టు పాల్గొంటుంది. ఏడాది చివర్లో భారత జట్టు కివీస్ పర్యటనకు వెళుతుంది.

న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీలు ఆడుతుంది. ఇక డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగే హోం సిరీస్‌తో 2026లో భారత జట్టు క్రికెట్ సీజన్ కు ఎండ్ కార్డ్ పడుతుంది. పురుషుల జట్టు తో పాటు మహిళల క్రికెట్ జట్టుకు కూడా పలు సిరీస్‌లు ఉన్నాయి. ముఖ్యంగా జనవరిలో మహిళల ఐపీఎల్(డబ్ల్యూపీఎల్) వు మెన్స్ క్రికెట్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. అలాగే భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్లతో పాటు టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. దీంతో ఎటు చూసినా భారత క్రికెట్ ఫ్యాన్స్ కు  2026 ఫుల్ మీల్స్ అందించబోతోంది.

డబ్ల్యూపీఎల్

జనవరి 9 నుంచి 

ఫిబ్రవరి 5

వేదిక : భారత్

మ్యాచ్‌లు : 22

ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్

జనవరి 15 నుంచి 

ఫిబ్రవరి 6

వేదికలు  : జింబాబ్వే, 

నమీబియా

మ్యాచ్‌లు : 41

ఐసీసీ టీ20 ప్రపంచకప్

ఫిబ్రవరి 7 నుంచి 

మార్చి 8

వేదికలు  : భారత్, 

శ్రీలంక

మ్యాచ్‌లు : 55

ఐపీఎల్

మార్చి 26 నుంచి

మే 31

వేదిక  : భారత్

మ్యాచ్‌లు : 84

 ఆసియా క్రీడలు

సెప్టెంబర్ 19 నుంచి

అక్టోబర్ 4

వేదిక  : జపాన్