20 March, 2026 | 10:05 AM

అసమర్థను కప్పి పుచ్చుకునేందుకే కేసులు

05-12-2024 10:35 PM

భైంసా,(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వ వైఫల్యాలన్ని కప్పి పుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ  ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీఆర్‌ఎస్ ముథోల్ నాయకుడు కిరణ్ కొమ్రెవార్ ఓ ప్రకటనలో ఆరోపించారు.  మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డిలపై ఫోన్‌ట్యాపింగ్ కేసులు పెట్టడం ప్రభుత్వం పిరికి చర్యలన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగు విధంగా జవాబు చెపుతారని తమ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.