calender_icon.png 6 August, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా శ్రావ్య సుదీర్‌ రెడ్డి

05-12-2024 10:38:08 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా గురువారం ఎస్ శ్రావ్యసుధీర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, పిసిసి సభ్యులు కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, పెన్‌పహాడ్ మండల అధ్యక్షులు తూముల సురేష్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచనలేకుండా పని చేస్తానని, ప్రభుత్వం అందజేసే పథకాలను అర్హులైన ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.