పొలిటికల్ డైవర్షన్‌కే రాంచందర్‌రావు లేఖ
- రాహుల్‌ని కలిస్తే ఆయన ఉద్యోగం ఉంటుందా?
- డీటీవో మరణం అత్యంత బాధాకరం
- ప్రతి విషయాన్ని రాజకీయ చేయడమే హరీశ్‌రావు పని
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి కిష న్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశా రు.. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేఖలు రాయడం లేదు’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అయితే పొలిటికల్ డైవర్షన్ కోసమే రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లేఖ రాశారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీని కలిస్తే రామచందర్‌రావుకు ఒరిగేది ఏమీ లేదన్నారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామచందర్‌రావుకి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తే ముందు ఆయన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో చూసుకోవాలన్నారు. ముందు మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలనను అడుగుతామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షల జమ ఎక్కడ చేశారో మోదీని అడుగుతామన్నారు.
బీజేపీ చీఫ్ రాహుల్ గాంధీని కలవాలని ఉంటే ప్రధాని మోదీ తో రాజీనామా చేసి రాహుల్ ను ప్రధాని చేయండి.. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెలంగాణకు రావాల్సినవి క్షణాల్లో తెచ్చుకుంటామన్నారు. ఐఆర్‌ఎఫ్‌సీ వద్ద ఉన్న మెట్రో లోన్ డబ్బును విడుదల చేయాలని సీఎం అడుగుతున్నారని, అది ఆయన వ్యక్తితమేమి కాదనే విషయం బీజేపీ నేతలు తెలుసు కోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.
ధాన్యం కొనుగోళ్ల పైన బీఆర్‌ఎస్ పార్టీ కేంద్రంపైన ఎందుక ఒత్తిడి తీసుకురావడం లేదని, తెలంగాణ రైతుల కోసం ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కనీసం కేంద్రానికి లేఖ కూడా రాయలేకపోతున్నాడని విమర్శించారు. మోదీ, బీజేపీ పేరు ఉచ్చరించానికి కూడా కేటీఆర్, హరీశ్‌రావు ధైర్యం చేయడం లేదన్నారు. భూపాలపల్లి డీటీఓ మరణం అత్యంత బాధాకరమని, ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం హరీశ్ రావుకు మంచిది కాదని ఆయన హితవు పలికారు.






