calender_icon.png 17 September, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

17-09-2025 03:02:14 PM

గడ్చిరోలి: మహారాష్ట్రలో ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు(Female Maoists) మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలో(Gadchiroli District) మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఘటనాస్థలిలో ఏకే-47 సహా పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా అడవుల్లో భద్రతాదళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Communist Party of India) శాంతి చర్చలను సులభతరం చేయడానికి తన సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.