calender_icon.png 17 September, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం

17-09-2025 02:53:40 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు..

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో బుధవారం జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కార్యవర్గ సన్మాన సభ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సమాజానికి అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అలాగే అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలకు కాపలాదారులుగా నిలవడంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

అనంతరం ప్రెస్ క్లబ్ గౌరవ ఆధ్యక్షులు సందూర్ వార్ హన్మండ్లు, ఉపాధ్యక్షులు శివాజీ అప్పా,ప్రధాన కార్యదర్శి కర్రెవార్ బాలాజీ, కార్యదర్శి ఆకుల పాండు, కోశాధికారి నగేష్  పాలేకర్ లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ హనుమాన్ మందిర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్, మండల జర్నలిస్టులు కాంగ్రెస్ నాయకులు తదితరులు  పాల్గొన్నారు.