calender_icon.png 17 September, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన టీజీపీఎస్​సీ

17-09-2025 02:30:20 PM

హైదరాబాద్: గ్రూప్-1 అంశంపై టీజీపీఎస్​సీ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) డివిజన్ బెంకు వెళ్లింది. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్​సీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. గ్రూప్-1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈనెల 9న తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్లు మళ్లీ దిద్దాలని లేదా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సింగిల్ బెంచ్ తీర్పులో పేర్కొంది. ఎనిమిది నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఇటీవల సింగిల్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్​సీ(Telangana Public Service Commission) డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాలపై ఇప్పటికే తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న గ్రూప్ వన్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గ్రూప్ వన్ ఫలితాలపై రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు పెట్టి పోస్టులు కొన్నామని వస్తున్న ఆరోపణలను ఖండించారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.