17-09-2025 02:49:51 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రాజేశం ఆధ్వర్యంలో సిపిఐ జెండాను ఎగరవేసి 79వ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం 4500 మంది అమరులు గ్రామాలను విముక్తి చేసి పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారని అన్నారు.