17-09-2025 03:16:22 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవన్ని క్యాతనపల్లి పురకార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పుర కమిషనర్ రాజు(Commissioner Raju) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత తెలంగాణ కోసం పోరాడి సెప్టెంబర్ 17న ప్రజాపాలనలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల త్యాగం, వారి పోరాటం మన భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఛైర్మన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యా సాగర్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు తదితరులు పాల్గొన్నారు.