calender_icon.png 17 September, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అంటేనే త్యాగానికి ప్రతీక

17-09-2025 02:56:34 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు..

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడూతూ.. ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైన శుభదినం రోజున జరుపుకుంటున్న “ప్రజా పాలన దినోత్సవం” సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన.. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం.. ఆనాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.