calender_icon.png 30 October, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండు కుండను తలపిస్తున్న కిష్టాపురం చెరువు.. పూజలు చేసిన గ్రామస్తులు

30-10-2025 06:25:18 PM

దిగువకు తూము ద్వారా నీటిని విడుదల చేసిన గ్రామ పెద్దలు

మునుగోడు (విజయక్రాంతి): అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కిస్టాపురం చెరువుకు ఎగువ నుండి వరద నీరు చేరి నిండుకుండను తలపిస్తోంది. 100 ఎకరాల విస్తీర్ణం కలిగి పరిసర ప్రాంతాల్లోని ఆయకట్టుకు సాగునీరందించే సామర్థ్యం చెరువు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దుంకుతోంది.

గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమన సైదులు, గ్రామ మాజీ సర్పంచ్ బూడిద లింగయ్య యాదవ్, నందిపాటి రాధా రమేష్, గ్రామస్తులతో మేళ తాళాలతో పెద్ద చెరువువును సందర్శించి గంగా మాతకు ప్రత్యేక పూజలు చేసి దిగువకు తుము ద్వారా నీటిని ఇప్పర్తి, తాళ్ల వెల్లంల, ఊకోండి గ్రామాలలోని చెరువులకు విడుదల చేశారు. అలుగు నీటిలో వరద పాయసం పోసి పాడి పంటలు, మత్స్య సంపదతో గ్రామం సుభిక్షంగా ఉండాలని గంగామాతను వేడుకున్నారు. కిష్టాపురం చెరువు నుండి నీటిని విడుదల చేయడంతో పరిసర ప్రాంతాల గ్రామాల్లోని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉన్నారు.