30-10-2025 06:22:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంతో పాటు సారంగాపూర్ దిల్వార్పూర్ నర్సాపూర్ మండలాల్లో ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సోయా కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సోయ పండించిన రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని పంటను విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ అధికారి ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకన్ రెడ్డి. బిజెపి నాయకులు చంద్రకాంత్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ధర్మాజీ రవీందర్ బిజెపి నాయకులు మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు
పోలీసు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
నిర్మల్ ఎమ్మెల్యే గన్మెన్ సుదీర్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నిజాంబాద్లో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు అంతకు ముందు అదే జిల్లాలో తడిసిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వం రైతులు తడిసిన పంటను నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు