13-01-2026 12:03:07 AM
గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. అక్కడి సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో కలిసి హనుమంతుని చిత్రంతో ఉన్న గాలిపటం ఎగురవేస్తూ సందడి చేశారు. ఫెస్టివల్‌లో వీరిద్దరి ఉత్సాహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు ఇద్దరు నేతలు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.