26-11-2025 12:00:00 AM
సైక్లిస్ట్ చందన జయరాం సాహసయాత్ర
హైదరాబాద్, నవంబర్ 25 : ఫిట్‌నెస్‌పై మహిళలకు సైక్లిం గ్ ద్వారా అవగాహన కల్పించడమే లక్ష్యంగా మిస్ యూనివర్స్ ఏపీ, సైక్లిస్ట్ చందన జయరాం వినూత్న సాహసయా త్రకు సిద్ధమవుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వరకూ 600 కిలోమీటర్ల సైక్లింగ్ రైడ్ చేయబోతున్నారు. ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ మాధురి గోల్డ్ ఈ కార్యక్రమానికి మద్ధతుగా నిలిచింది.
ఈ సుదీర్ఘ రైడ్‌కు సంబంధించిన జెర్సీని చందన జయరాంతో కలిసి మాధురి గోల్డ్ సీఈవో సునీల్, సీఎంవో, జాతీయ ఆఫ్ రోడ్ బైకింగ్ చాంపియన్ విశ్వాస్ ఆవిష్కరించారు. ఈ నెల 30న శ్రీకాళహస్తిలో సైక్లింగ్ రైడ్ ప్రారంభం కానుం దని చందన జయరాం చెప్పారు. తన రైడ్ స్ఫూ ర్తితో కొందరు మహిళలలైనా సైక్లింగ్ చేయాలని ఆకాంక్షిం చారు. ఒక మంది ఉద్దేశంతో చందన జయరాం చేపట్టిన ఈ కార్యక్రమానికి మాధురి గోల్డ్ తరపున మద్ధతుగా నిలవడం సంతోషంగా ఉందని సీఈవో సునీల్ చెప్పారు.