calender_icon.png 5 August, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులు నింపాలని బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

04-08-2025 10:30:45 PM

మంచిర్యాల (విజయక్రాంతి): కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్లు ఎత్తి పోసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నింపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన ‘చలో కన్నెపల్లి’ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Nadipelli Diwakar Rao), మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, రవి శంకర్, దాసరి మనోహర్, విద్యాసాగర్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు చెల్మేడ లక్ష్మీ నరసింహ రావు, దావ వసంత, రఘువీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.