04-08-2025 10:41:44 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు పోలీస్ స్టేషన్(Chinnagudur Police Station) పరిధిలో వాహన తనిఖీలు నిర్వాహిస్తుండగా అనుమానస్పదంగా ప్రవర్తిస్తున్న ముగ్గురు వ్యక్తుల వద్ద ఉన్న సూట్ కేసును పరిశీలించగా అందులో 12.440 కేజీల ఎండిన గంజాయిని లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కురవి మండలానికి చెందిన లునావత్ సుమన్, ఎలమశెట్టి సాయి కుమార్, చిన్నగూడూరు మండలానికి చెందిన పిట్టల రమేష్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు.