04-08-2025 10:33:48 PM
మంథని గురుకుల ప్రిన్సిపాల్ శ్రీనాథ్...
మంథని (విజయక్రాంతి): 2025-2026వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీపీ, బైపీసీ విభాగంలో మిగిలిన సీట్లకు బాలుర నుండి స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల(బాలురు) మంథని ప్రిన్సిపాల్ శ్రీనాథ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం (06/08/2015) నాడు మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల స్పాట్ అడ్మిషన్లకు ఉదయం 9 గంటల నుండి ఎంపీసీ విభాగంలో, బైపీసీ విభాగంలో మిగిలిన సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2025 మార్చిలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. స్పాట్ కౌన్సిలింగ్ వచ్చేటువంటి విద్యార్థులు తప్పనిసరిగా తమ యొక్క ఒరిజినల్ విద్యార్హత పత్రాలు (టిసి, మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్, 4 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు) వెంట తీసుకురావాలని ప్రిన్సిపల్ సూచించారు.