calender_icon.png 12 January, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమ్మూరి సొంత ఊర్లో సర్పంచ్ గెలవలేదు

12-01-2026 01:22:36 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

తరిగొప్పుల, జనవరి11 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయం వద్ద ఆదివారం రోజున మండల అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాము నిర్వహించారు.  ఈ సమావేశానికి ముఖ్య అధితిగా  ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి  పాల్గొనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత మంది మళ్లీ మళ్లీ పోటీ చేయడం వలన ఓడిపోవటం జరిగింది కానీ మొత్తం మనమే అన్ని సర్పంచులు గెలిచేవారిమీ మొన్న జరిగిన కేటీఆర్ మీటింగ్ కి అధిక సంఖ్యలో హాజరయ్యారు.  మండలంలోనీ నర్సాపూర్ గ్రామంలో లో మనమే గెలిచాం. కానీ అధికారులు తొండి చేసి కాంగ్రెస్ నీ గెలిపించినారు.

ఆఖరి రోజు ప్రచారంలో మనము కొట్టినం అని తప్పుడు ప్రచారం చేశారు. పోలీసులు కూడా సమయానికి రాలేదు , అంతా జరిగినకగా వచ్చారు అందరు కలిసి మనల్ని ఓడించారు. ఏ పని ఉన్నా కూడా ఆ ఊరికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, హామీ ఇచ్చారు. నైతిక విజయం మనదే అని, ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ లో గెలిచిన వారు అందరూ కూడా పార్టీని చూసి కానీ ఇంచార్జి నీ చుసి కానీ గెలవలేదు కేవలం వారి వ్యక్తిగతంగా మాత్రమే గెలిచారు. 131 గ్రామ పంచాయతీలలో 75 మంది మన వారు , సిద్దిపేట తర్వాత మనదే ఆధిక్యం అని అన్నారు. ఇవ్వాల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు విషయంలో కూడా తొండి చేసే ప్రయత్నం చేశారు. 

ఇవ్వాళ కొమ్మూరి ప్రతాపరెడ్డి  ఊరిలో, వారి అత్త గారి ఊరిలో గెలవలేదు కానీ ఇక్కడికి వచ్చి పదే, పదే దొంగ ఓట్ల తోనే గెలుచవ్ అని అంటున్నాడు. నేను17,400 ఓట్ల తోనే గెలిచాను తరిగొప్పుల కి నేను నీళ్లు తెచ్చాను అని అబద్దం చెప్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఏ గ్రామంలో కూడా తట్టెడు మట్టి కూడా తీసారా? కనీసం నీ కార్యకర్తలు కి కప్పు టీ కూడా పోయావు నువ్వు కేవలం సిఐ,ఎస్‌ఐ, పోస్టింగ్ కోసం డబ్బులు తీసుకొని ఇస్తున్నావ్ అని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ను విడిచి బిఆర్ స్ లోకి అధిక సంఖ్యలో కార్యకర్తలు చేరారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుర్ర మల్లయ్య, బై కానీ బాలరాజ్, సర్పంచ్ రవి, చిలువేరు లింగం, ఉపసర్పంచ్లు,వార్డ్ మెంబర్లు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.