calender_icon.png 9 August, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో కోనసముద్రం

01-01-2025 12:00:00 AM

నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలంలోని చిన్న గ్రామం కోనసముద్రం. ఊరు చిన్నది పేరు పెద్ద ది. ప్రపంచ ప్రఖ్యాతమైన తెలంగాణ ఉక్కు తయారుచేసిన ఉక్కు ఉత్పత్తి కేం ద్రం. కొత్త తెలంగాణ చరిత్రబృందం కోనసముద్రానికి యాత్రచేసింది. చరిత్రకారులు, పరిశోధకులు కోనసము ద్రం క్రీ.పూ. నుంచే ఉక్కుకు పేరుగన్న ఊరని రాశారు. ఆసియాలోని డెమస్క స్, పర్షియా, ఐరోపాలోని గ్రీకు, రోమ్ దేశాలకు ఇక్కడి ఉక్కే ఎగుమతి అయ్యేది.

డెమస్కస్ కత్తులకు పేరుపొందిన నగరంగా పేర్కొనబడ్డది. ఆ కత్తుల తయారీకి తెలంగాణ ఉక్కే మూలకం. పడుమటి దేశాలవారు ఉక్కుకొనడానికి తమ దగ్గర చెలామణీలో ఉన్న బంగారు నాణాలను చెల్లించేవారట. కోనస ముద్రం గ్రామంలోని బండ్రోని బంగ్లా, పాతబాయి ఉక్కు చరిత్రకు అనవాళ్లు. గ్రామంలోని కమ్మరి ఇనుప ఖనిజ పు మట్టిని తెచ్చి, ఏరి ముద్ద లు చేసి కొలిమిలో కాల్చి, తయారు చేసిన ఇనుప ముద్దలను ఉక్కుగా మార్చేవారు.

కత్తులు, బాకులు, బరిసెలు, ఈటెలు, బాణాలములుకులు తయారయేవి ఇక్కడ. వాడుకం ఇనుప వస్తువులు చేసేవారు. 19వ శతాబ్దపు ఆరంభంలో కోనసముద్రం ఉక్కు విదేశీ పర్యాటకులను ఆకర్షించింది. ఉక్కు ఉత్పత్తి పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచింది. కోనసముద్రం తెలంగాణకే గర్వకారణమన్నాడు కందకుర్తి యాదవరావుగారు.

యూరోప్‌లో పారిశ్రామిక విప్లవం కారణంగా మనవద్ద నుంచి ముడి ఖనిజాన్ని సేకరించి, పనిముట్లు తయారుచేసి మనకే తిరిగి పంపి, వ్యాపారాన్ని మొదలైంది. ఈ గ్రామం ఇనుము, ఉక్కు ఘనత తెలిసి అమెరికాలో ఉండే డచ్ దేశస్తురాలు చెందిన థెల్మాలోవే, పరిశోధకురాలు కోనాసముద్రం వచ్చి. ఇక్కడి పరిసరాల్లో లభ్యమయే ఇనుము మీద పరిశోధనలు జరిపింది. ఈమె నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇనుప పరిశ్రమ కేంద్రాలను గుర్తించింది. 

వీటిలో ఎక్కువగా మెగాలిథిక్ కాలంనాటి కేంద్రాలుగా భావించింది. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెదరాతియుగం సమాధుల మీద పరిశోధనలు జరిపిన కేపీరావు బృందం నాటి సమాధులలో క్రీ.పూ. 2300ల నాటి ఇనుప పనిముట్లను గుర్తించారు. అందువల్ల తెలంగాణాకు ఇనుం తయారీలో 4300 సం.రాల చరిత్ర ఉంది.

17వ శతాబ్దంలో ‘హావర్’ అను వ్యక్తి తెలంగాణలో విస్తరించి ఉన్న ఇనుము పరిశ్రమను గుర్తించి వివరించాడు. క్రీ. శ. 1823లో ఇస్ఫాన్ దేశానికి చెందిన ఇనుము, ఉక్కు వ్యాపారి కోనసముద్రం నుంచి ఉక్కు తమ దేశానికి ఎగుమతి అయ్యేదని పేర్కొన్నారు.

చరిత్రకారుడు గిల్డల్ కోన సముద్రంలో దొరికే ఇనుప ఖనిజం ఇంగ్లాండ్, స్వీడన్‌లలో లభ్యమయ్యే దాని కంటే నాణ్యమైనదని తాను రాసిన ‘కల్సర్ ఆఫ్ దక్కన్’లో ప్రస్తావించాడు. చరిత్రకారులు డాక్టర్ జైశెట్టి రమణయ్య, చరిత్రకారులు డాక్టర్ ఎస్. జైకిషన్ కోనసముద్రంలో పరిశోధన లు చేసి క్రీ.పూ.నుంచే కోనసముద్రంలో ఇనుము- ఉక్కు పరిశ్రమ గురించి ‘కాలగమనములో కోనసముద్రం’ అనే పుస్తకం రాశారు.