01-01-2025 12:00:00 AM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చారిత్రాత్మక, ప్రాచీన కట్టడాలకు కొదవలేదు. ప్రాచీ న కట్టడాల్లో గొండు రాజుల కోట ఒకటి. ఆదివాసీల సంస్కృతికి చిహ్నమైన గోండు రాజుల కోటలు కొంత శిథిలమైనా నేటికీ ఆకర్షిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పురావ స్తు శాఖ గొండరాజుల కోట పూరవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ప్రాచీన కోటలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పుట్టినిల్లు. ఇక్కడున్న 72 పురాతన కోటలు చరిత్రకు సాక్ష్యా లుగా నిలుస్తున్నాయి. ఉట్నూర్‌లోని ఆదివాసీల ప్రాచీన గొండు రాజుల కోట ఆనాడు గొండానా పాలన కేంద్రంగా కొనసాగింది.
కోట చరిత్ర
ఉట్నూరు గోండు రాజులు మొదట చంద్రపూర్ గోండు రాజు అయిన బల్లార్షా రాజు కింద సామంతులుగా పాల న సాగించారు. ఆ తరాత ఉట్నూరు రాజధానిగా రాజ హన్మంతరావు, జలపతిరావు, రాజ దేవ్‌షాల పాలన సాగింది. 13వ శతాబ్దంలో మూడు ఎకరాల స్థలంలో ఉట్నూరు లో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు. ఈ కోటలో ఆత్రం రాజ్ గోండుల, సీతాగొంది రాజుల కోటకు 700 యేండ్ల చరిత్ర ఉంది. నిర్మల్ రాజులతో యుద్ధం చేసి విజయం సాధించారు.
కోట విశేషాలు
గోండు రాజులు నివసించడంతో గోండు కోటగా పిలిచేవారు. ఈ ప్రాంతంలో వసూ ళ్లు చేసిన శిస్తును ఉట్నూర్ కోటలో జమచేసేవారు. ఉట్నూరు కోటలోని కోనేరు దృశ్యం ఆనాటి కట్టడాలు నిలువెత్తు నిదరనంగా నిలుస్తోంది. ఈ కోట చుట్టూ 8 అడు గుల లోతైన కందకం ఏర్పాటు చేశారు.
కోట కు తూర్పు భాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ దారం పటిష్ఠమైన కలపతో, కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు వంటివి ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించారు. లోపలి దారం పక్కగా ఎత్తయిన వేదికపైనున్న దర్బార్ వద్దకు చేరుకోవడానికి మెట్లు ఉన్నా యి. దారానికి ఎడమపక్క దిగుడు బావి, రాజ కుటుంబాల స్నాన వాటికలు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా రాతి గదులు మొదలైనవి ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్న కోటల్లో గోండురాజుల కోటకు విశిష్టమైన స్థానం ఉంది. శిస్తు రూపంలో వచ్చిన బంగారు, వెండి నాణాలను ఈ కోటలో జమచేసేవా రు. బంగారు, వెండి నాణేలను పాత్రలో ఉంచి కట్టడాల కింద గుప్తం చేసేవారు.
అవసరమైన సందర్భాల్లో వాటిని వెలికితీసి అభి వృద్ధికి వినియోగించేవారు. దీంతో ఉట్నూర్ కోటలో ఖజానా దాగి ఉందని దుండగలు కోట లో గుప్త నిధుల తవకాలతో విధంసానికి పాల్పడ్డారు. దీంతో ఉట్నూర్ కోట ఆనవాళ్లు కోల్పోతోంది. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం సంస్థానం ఆధీనంలోనే ఈ ప్రాంతం ఉండేది.