01-01-2025 12:00:00 AM
అయోధ్య రామ మందిర నిర్మాణానికి పునాది పడింది కాకతీయ నైపుణ్యంతోనే. అయితే పునాది వేయడంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు, నీట్ రిటైర్డ్ సివిల్ ఇంజినీర్ పాండురంగారావు పాత్ర ఎంతో ఉంది. ‘సాండ్ బాక్స్ టెక్నాలజీ’ని వెలుగులోకి తెచ్చి అయోధ్య రామమందిర నిర్మాణంలో పాలుపంచుకున్నాడాయన. భారీ ఆలయాలు, కట్టడాలకు బలమైన పునాది వేయడమే ఈ సాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రత్యేకత. ప్రకృతి విపత్తులు సంభవించినా.. భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ సాండ్ బాక్స్ టెక్నాలజీతోనే కాకతీయ నిర్మాణాలు
సిమెంట్ కాంక్రీట్ పునాదితో ఒక కట్టడం నిర్మిస్తే మహా అంటే అది వందేళ్లు నిలుస్తుంది.. ఇళ్ల నిర్మాణం ఏమోగానీ, వెయ్యేళ్ల పాటు ఒక గుడి నిలవాలంటే పునాది మరో లా ఉండాల్సిందే. కాకతీయులు నిర్మించిన ఆలయాలు దాదాపు వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా, పటిష్టతకు నిలువెత్తు సంతకంలా నిలిచాయంటే కారణం మరేదో ఉంది. అది సాండ్ బాక్స్ టెక్నాలజీ.
ప్రకృతి విపత్తులు సంభవించినా, భూకంపాలు వచ్చినా అప్ప టి ఆలయాలు గట్టి పునాదులతో చెక్కుచెదరకుండా ఉన్నాయి. మొన్నటి దాకా కోట్లాది మంది భారతీయులు కలగన్న అయోధ్య రామమందిర నిర్మాణంలో ఇదే టెక్నాలజీని ఉపయోగించారు. అంతటి అద్భుత నిర్మాణానికి పటిష్ట పునాది పడేలా కృషిచేసిన వారు..
కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు, నీట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు. అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైనప్పుడు, పునాది నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు గ్రహించి సాండ్ బాక్స్ టెక్నాలజీని అక్కడి వారికి పరిచయం చేశారు. ఈ టెక్నాలజీతో రామప్ప, వెయ్యి స్తంభాల గుడి కట్డడాలు ఎంత బలంగా ఉన్నాయో చాటి చెప్పా రు.
తద్వారా అయోధ్య నిర్మాణానికి బలమైన పునాది వేశారాయన. రామ మందిర నిర్మాణానికి ప్రొఫెసర్ పాండురంగారావు చెప్పిందే సరైన మార్గమని పలు ఐఐటీ కాలేజీల ప్రొఫెసర్‌లు అంగీక రించక తప్పలేదు. అసలు సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఎమిటో తెలిపే ప్రత్యేక కథనం..
నేటికీ బలంగా ఉండటం విశేషం.
ఎవరికైనా ముందుచూపు ఉండటం ఎంతో ముఖ్యం. అందులోనూ ఒక నిర్మాణం చేపడుతున్న క్రమంలో సుదీర్ఘకాలం బలంగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవడం అత్యవసరం. ఒక ఇంటినే వందేళ్ల పాటు పటిష్ఠంగా ఉండేవిధంగా నిర్మించేందుకు ప్రయత్నిస్తారు. ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఆలయాల నిర్మాణం ఇంకెంతో పటిష్టంగా ఉండాలని కోరుకుంటారు.
ఆనాటి కట్టడాలే గత చరిత్రకు ఆనవాళ్లుగా నేటికి పరిగణిస్తున్నారు. వేల ఏళ్లు ఆలయాల నిర్మాణం బలంగా ఉండటమే అందుకు కారణం. అయితే ఎంతటి నిర్మాణానికైనా పటిష్టమైన పునాదే ఆధారం. ఆలయాల, చారిత్రక కట్టడాల పటిష్టత అంశంలో కాకతీయుల నిర్మాణ నైపుణ్యం గురించి తప్పక గుర్తుచేసుకోవా ల్సిందే.
ఓరుగల్లు కళావైభవం, కాకతీయ కళాతోరణమే ఇందుకు సరైన నిదర్శనం. 11వ శతాబ్దంలోని కాకతీయుల కళాత్మక నిర్మాణాల నైపుణ్యం ఎల్లలు దాటుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రత్యేక పునాది నిర్మాణమే. 21వ శతాబ్దంలోనూ కాకతీయుల నిర్మాణ పద్ధతులను పాటించడం వారి ముందు చూపునకు నిదర్శనం.
ప్రస్తుత సిమెంటు, కాంక్రీటు నిర్మాణ పద్ధతి కంటే ఎన్నో రేట్లు ఉత్తమమైన (సాండ్ బాక్స్ టెక్నాలజీ)ని కాకతీయులు కనిపెట్టారు. సిమెంట్, కాంక్రీటుతో నిర్మిస్తే గరిష్టంగా వందేళ్ల భవిష్యత్ ఉంటే.. సాండ్ బాక్స్ విధానంలో వేల ఏళ్లపాటు చెక్కు చెదరని నిర్మాణాలు సాధ్యమవుతాయి.
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామ మందిర నిర్మాణంలో కాకతీయుల సాండ్ బాక్స్ పద్దతిని అవలంబించడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అయితే రామ మందిర నిర్మాణంలో కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని వినియోగించడంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు, నీట్‌లో రిటైర్డ్ ప్రొ.పాండురంగారావు కీలక పాత్ర పోషించారు.
అయినా చెదరలేదు
కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు, కళావైభవాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వందేళ్ల ఏళ్లకు పూర్వం కాకతీయు లు నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ సురక్షితంగానే ఉన్నాయి. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆల యాల నిర్మాణంలో కంకర, సున్నం లేకుండా కేవలం ఇసుకనే పునాదిగా చేసుకుని నిర్మించారు. ఇవి భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా ఉన్నాయి.
రెక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా నిర్మించారు. రామప్ప ఆలయాన్ని పూర్తిగా నల్లరేగడి నేలలో నిర్మించారు. అయితే నిర్మాణానికి అనువు గా లేని నల్లరేగడి నేలలో సాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు.
అడుగు భాగంలో ఇసుకను నింపి దానిపై శిలలను పేర్చుకుంటూ వచ్చారు. నిర్మాణం బరువుగా ఉండకుండా తేలికపాటి ఇటుకలనే ఉపయోగించారు. ఎలాంటి సాంకేతకత అందుబాటులో లేని కాలంలో కాకతీయులు ఉపయోగించిన పద్ధతే ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణంలో ఉపయోగించారు.
కాకతీయ నైపుణ్యంతో అయోధ్య
2019లో అయోధ్య రామ మందిర నిర్మాణానికి శం కుస్థాపన జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి 2020లో ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేశారు. వందల అడుగుల పొడవు, వెడల్పుతో నిర్మించిన దేవాలయం లో టన్నుల బరువున్న స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ స్థాయిలో బరువు మోయటంలో పునాలదే కీలక పాత్ర. అందుకే నిర్మాణ సంస్థ సిమెంట్ కాంక్రీట్ టెక్నాలజీతో పునాదులు వేసింది.
అయితే అయోధ్యకు పునాదులు వేయడానికి నిర్మాణ సంస్థ అనుసరించిన టెక్నాలజీలో లోపాలున్నట్టు వరంగల్‌లోని నీట్‌లో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొ.మండేల పాండురంగా రావు ప్రధాని మోడీని లేఖ రాశారు. నిర్మాణంలోని లోపాలతోపాటు ఏ పద్ధతిలో పునాదులు వేస్తే ఆలయం పటిష్టంగా ఉంటుందో లేఖ ద్వారా వివరించారు.
దాంతో పాండురంగారావుకు ఆహ్వానం అందింది. సాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారా రామప్ప దేవాలయం 830 ఏళ్లు గా ఎంత పటిష్టంగా ఉందో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రామ మందిర నిర్మాణ సంస్థకు వివరించారు. ప్రొ.పాండురంగారావు చెప్పిన విషయంతో రామజన్మ భూమి ట్రస్ట్ ఏకీభవించి నిర్మాణ పనులను నిలిపేసింది. పాండురంగారావు రిపోర్ట్ ఆధారంగా కాకతీయ నిర్మాణ శైలి ఆధారంగానే అయోధ్య నిర్మాణమైంది.
ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీ
ఢిల్లీ, ముంబై, చెన్నై ఐఐటీ కాలేజీల్లోని సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ అనేక సార్లు చర్చలు జరిపి ప్రొ.పాండురంగారావు చెప్పిందే సరైన మార్గమని నిర్ణయించి పీఎంవోకు రిపోర్టు అందించారు.
అయితే కాకతీయుల రామప్ప దేవాలయం నిర్మాణం లో పునాదులు తీయడానికి ఉపయోగించిన సాండ్ బాక్స్ టెక్నాలజీని యథాతథంగా ఇప్పుడు నిర్మాణంలో ఉపయోగించడం సాధ్యకాకపోవడంతో సాండ్ బాక్స్ టెక్నాలజీ వంటి ఓపెన్ ఎక్స్‌కవేషన్ టెక్నాలజీతో పునాదులు తీసి నిర్మాణం చేపట్టారు.
ఈ పద్ధతిలో 400 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పు, 50 అడుగుల లోతులో మట్టి తవ్వి సాండ్ స్పెషల్ మిక్సర్‌తో పునాది వేసి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు.
ఏమిటీ సాండ్ బాక్స్ టెక్నాలజీ
నిర్మాణ ప్రదేశంలో మొత్తాన్ని కనీసం 3 మీటర్ల లోతు తవ్వి పునాదికి సిద్ధం చేస్తారు. ఈ పునాదిలో పూర్తిగా ఇసుక నింపుతారు. ఈ ఇసుక మిశ్రమానికి గట్టిదనం ఇచ్చేందుకు కరక్కాయ, బెల్లం, గ్రానైట్ పొడులతో మిశ్రమాన్ని జతచేస్తారు. ఈ ఇసుక పునాది మీదే భారీ శిలలతో కూడిన ఆలయాన్ని నిర్మిస్తారు.
భూకంప తరంగాలను ఈ ఇసుక పునాది తట్టుకోగలదు. భూకంప తరంగాల దాటికి ప్రదిక్షణ పథం, కక్షాసనం, గోడలు, పైకప్పుల్లో వినియోగించిన శిలలు విడిపోకుండా ఉండేందు కు ఇనుప పట్టీలను అప్పటి నిర్మాణాల్లో అమర్చుతారు. ఇందుకోసం నిర్మాణంలో వినియోగించిన శిలలు, శిల్పా లు కలిసే చోట శిలను తొలిచి కరిగించిన ఇనుమును నింపుతారు.
దీంతో నిర్మాణం మొ త్తం ఒక ఫ్రేములాగా పటిష్టంగా తయారవుతుంది. వరంగల్ నీట్ సహకారంతో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 1980లో కాకతీయుల చారిత్రక కట్టడాలపై పరిశోధనలు జరిగాయి. ఆ సమయంలో ఇసుక పునాదిపై భారీ నిర్మాణాల అంశం వెలుగులోకి వచ్చింది. కాకతీయుల సాంకేతిక నైపుణ్యాన్నికి సాండ్ బాక్స్ టెక్నాలజీయే కారణమని పేర్కొన్నారు.
కట్టడాల రక్షణకు పాండురంగారావు కృషి
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా ప్రొ. పాండురంగారావు దశాబ్దాలుగా కాకతీయుల చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అయోధ్య రామ మందిర నిర్మాణంలో కాకతీయులు ఉపయోగించిన సాండ్ బాక్స్ టెక్నాలజీ వాడటానికి ప్రొ. పాండురం గారావు కీలక భూమిక పోషించారు.
వాస్తవానికి ప్రొఫెసర్ జోక్యం చేసుకుని ఉండకపోతే రామ మందిర నిర్మాణంలో అతి పెద్ద లోపం తలెత్తేది. భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీక నిర్మించే అయోధ్య రామ మం దిర నిర్మాణం ఒక చారిత్రక తప్పిదంగా మిగిలేది. స్వతహాగా నిట్ కాలేజీలో రిటైర్డ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవంతో కాకతీయ నిర్మాణ నైపుణ్యంపై మరింత అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాకతీయుల సాంకేతికతకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారు.