calender_icon.png 27 September, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

27-09-2025 06:48:15 PM

హనుమకొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) జిల్లాలోని 12 ఎంపీపీ, 12 జడ్పిటిసి స్థానాలు ఉండగా ఇందులో మహిళా స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను డ్రా తీశారు. ముందుగా ఎంపీపీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల డ్రా తీయగా అనంతరం జడ్పీటీసీ స్థానాలకు డ్రా తీశారు. రిజర్వేషన్ల ప్రకటన, మహిళా రిజర్వేషన్ స్థానాలకు డ్రా ప్రక్రియ మొత్తంను వీడియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో మేన శ్రీను, డీటీవో శ్రీనివాస్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ. వి. శ్రీనివాస్ రావు, కొలను సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నిశాంత్, రజినీకాంత్, శ్యామ్ సుందర్, కొట్టె ఏసోబు, ప్రవీణ్ కుమార్, నేహాల్, తదితరులు పాల్గొన్నారు.