calender_icon.png 27 September, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానంతో ప్రాణాలు కాపాడడం పుణ్యకార్యం

27-09-2025 06:44:35 PM

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింగరావు నందికొండ

కామారెడ్డి (విజయక్రాంతి): రక్తదానంతో ఒకరి ప్రాణాలను కాపాడడం పుణ్యకార్యం అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కామారెడ్డి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ నర్సింగరావు నందికొండ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా ప్రథమ జిల్లా జడ్జి డాక్టర్ సిహెచ్. వి. ఆర్. ఆర్ వరప్రసాద్, జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. మొదట వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కామారెడ్డి కార్యదర్శి టీ. నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి డాక్టర్ సూర సుమలత, ప్రథమ జూనియర్ సివిల్ జడ్జి కె. సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి. దీక్ష, జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్(బిచ్కుంద), సుష్మ (యెల్లారెడ్డి), భార్గవి (బాన్సువాడ) జిల్లా అటవీ అధికారి నిఖిత మొక్కలు నాటారు.

తరువాత హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కామారెడ్డి శాఖ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి. దీక్ష  స్వాగతం పలుకగా వేదికపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అటవీ అధికారి నిఖిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ప్రథమ జిల్లా జడ్జి డాక్టర్ సిహెచ్ వి ఆర్ ఆర్ వరప్రసాద్ జస్టిస్ నర్సింగరావు నందికొండని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నరసింహారావు నందికొండ మాట్లాడుతూ, రక్తదానం చేయడంతో ఒకరి ప్రాణాలను నిలబెట్టవచ్చని అదొక పుణ్య కార్యమని అన్నారు. ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు ఇది ఎంతో మేలు చేస్తుందని, తానూ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడినని గౌరవ హైకోర్ట్ న్యాయమూర్తి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

అనంతరం జరిగిన సత్కార కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అడ్వకేట్/గవర్నమెంట్ ప్లీడర్ కె. శ్యామ్ గోపాల్ రావు, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి రాజగోపాల్ గౌడ్, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీల బాలచంద్రనీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలకు అభినందన పత్రాలు అందజేసి, పండ్లను పంపిణీ చేశారు. తదనంతరం న్యాయమూర్తి జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పని తీరు మెచ్చి సత్కరించారు. జిల్లాలోని న్యాయమూర్తులతో సమావేశమై జుడీషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కోర్టు భవనాన్ని సందర్శించి, కామారెడ్డి జిల్లా కోర్టుకు ప్రభుత్వం కేటాయించిన భూమిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు టి రాజగోపాల్ గౌడ్, వి ఎల్ నరసింహ రెడ్డి, గజ్జల బిక్షపతి, వెంకట్రాంరెడ్డి, సిద్ధిరాములు, జయ ప్రకాష్, దేవరాజ్ గౌడ్, చింతల గోపి, సూర్య ప్రసాద్, ఆజాద్, కోర్టు సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు.