calender_icon.png 27 September, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శ్రమదానం..

27-09-2025 06:22:34 PM

కిలోమీటర్ దూరం వరకు రోడ్డుపై పడిన గుంతల పూడ్చివేత..

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖ కార్యకర్తలు పలుగు, పారపట్టి రోడ్డుపై పడిన గుంతలను పూడ్చి వేశారు. గత కొన్ని నెలల నుండి రోడ్డు గుంతల మయంగా మారి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మరింత గుంతల మయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అష్ట కష్టాలు పడ్డారు. ప్రయాణికుల బాధలను తీర్చేందుకు ఇందూరు గ్రామానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కిలోమీటర్ దూరం వరకు రోడ్డు బాగు చేసేందుకు నడుం బిగించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసిన మంచి పనికి గ్రామస్తులు ప్రయాణికులు అభినందిస్తున్నారు.