calender_icon.png 27 September, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ

27-09-2025 06:10:35 PM

హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్లలో టూరిజం పాలసీ లేదని, కాంగ్రెస్ హయంలో నూతన టూరిజం పాలసీ తీసుకొచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. శిల్పారామం వేదికగా జరిగిన టూరిజం కాంక్లేవ్(Tourism Conclave) కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. గోల్కొండ, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రముఖ పర్యాటక స్థలాలు హైదరాబాద్ లో ఉన్నాయని.. ఎకో, మెడికల్, హెల్త్, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని, హైదరాబాద్ లో రక్షణ, శాంతిభద్రతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ.. ప్రపంచ సుందరీమణుల పోటీలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.