22-09-2025 12:13:17 AM
మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, యువ నాయకుడు విజయ్ గౌడ్
జిన్నారం, సెప్టెంబర్ 21 :నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ సర్పంచ్ సురేందర్గౌడ్, యూత్ నాయకుడు విజయ్ గౌడ్ కొనియాడారు.
ఈ మేరకు ఆదివారం ఉదయం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పురస్కరించుకొని గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొప్ప పో రాటం చేశారన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఆయన ఆశయాలను కొనసా గిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ మల్లేష్, ఠాగూర్ రమణ సింగ్, సిహెచ్ గణేష్, ఎస్ మహేష్ గౌడ్ , పెరుగు నాగరాజు, కే మనోజ్, గడ్డమీద అనిల్ కుమార్, వడ్ల.శంకర్ చారి, దుర్గాప్రసాద్, రోహిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.