24-01-2026 08:38:35 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని 11,14,16,17,19 వార్డులలో రూ. 1కోటి 73 లక్షలతో నూతన సిసి రోడ్డు, డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని ఎమ్మెల్యే కనకయ్య అన్నారు.
కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు, కాంగ్రెస్ పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్, పులి సైదులు, మాజీ మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్లు జానిపాషా, పులిగండ్ల మాధవరావు, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, జాని, సుదర్శన్ కోరి, ఉల్లంగి సతీష్, రాజు సర్పంచ్ లు పాయం స్వాతి, పాయం లలిత, అరెం ప్రియాంక, వల్లాల మంగమ్మ, మాజీ కౌన్సలర్ పత్తి స్వప్ణ, గోచికొండ శ్రీదేవి, టౌన్ మహిళ అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప, తదితరులు పాల్గోన్నారు.