calender_icon.png 15 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రాంతి విద్యార్ది ప్రతిభ

14-07-2025 10:47:05 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని క్రాంతి విద్యాలయం విద్యార్ది నవోదయ, శ్రీరామ సైనిక్ పాఠశాలలో ప్రవేశాలకు అర్హత సాధించి తన ప్రతిభను చాటాడు. క్రాంతి పాఠశాల విద్యార్ది కొండపల్లి హేమంత్ శివ సాయి కృష్ణ హాల్ టిక్కెట్ సంఖ్య 3595451 తో నవోదయలో సీటు సాధించడం ఆనందంగా ఉందని కరెస్పాండెట్ సమత అన్నారు. ఇట్టి విద్యార్ది ఎటువంటి కోచింగ్ లేకుండా ఉత్తీర్ణత పొందటం, వారి తల్లితండ్రులు ఆ విషయాన్ని తెలపడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్య సంవత్సరం నుంచి విద్యార్థులకు పోటీ పరీక్షలు, సివిల్స్, నీట్, ఐఐటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్ది హేమంత్ ని, తల్లిదండ్రులును ఆమె అభినందించారు.