calender_icon.png 15 July, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవార్డు గ్రహీతను సన్మానించిన సిఐటియు నాయకులు

14-07-2025 10:49:47 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కాసీపేట-1 గనిలో హెడ్ ఓవర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న నెల్లి సదయ్య జాతీయ అవార్డ్ కు ఎంపికయ్యారు. తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ లో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పురస్కారం అందుకున్న సదయ్యను సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సోమవారం కాసీపేట-1 గనిపై యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకట స్వామి, ఏఐసిడబ్ల్యుఎఫ్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్ లు హాజరై మాట్లాడారు. సదయ్య సామాజిక సేవ కార్యక్రమాలలో తన వంతు కృషిగా తనకు తోచిన సహాయం చేయాలనే భావన కలిగిన వ్యక్తి అని, కష్టం వచ్చిన వారిని ఆదుకునే మనస్తత్వం కలవాడని కొనియాడారు.

కరోనా సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. అదేవిధంగా ఇటీవల ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడుట కొరకు సింగరేణి రెస్క్యూ ఆధ్వర్యంలో నెలరోజులపాటు తన సేవలు అందించారని తెలిపారు. ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటూ, కార్మిక సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తూ, పనిలలో సైతం తోటి కార్మికులకు రక్షణ విషయంలో అనేక సలహాలు సూచనలు ఇస్తుంటారన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గని అసిస్టెంట్ పిట్ కార్యదర్శి నాగవెల్లి శ్రీధర్, నాయకులు ప్రశాంత్, రమేష్, అలవాల సంజీవ్ లు పాల్గొన్నారు.