calender_icon.png 17 September, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు మృతి

17-09-2025 03:24:58 PM

సిద్దిపేట రూరల్: నారాయణరావు పేట మండలంలో కోదండరావుపల్లి గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న గ్యాదపక రమేష్(35) మంగళవారం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. రెండు నెలల క్రితం బైక్ ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రమేష్ మృతదేహానికి తహసీల్దార్ జయంత్, ఎంపీఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి చంద్రలేఖ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దహన సంస్కారాల కోసం గ్రామ పంచాయతీ తరఫున రూ.10,000 సాయం అందజేశారు. మృతుని భార్యను MPW వర్కర్‌గా నియమిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.