20-12-2025 01:55:14 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నకిలీ ఈఎస్‌ఎస్‌ఈ సిగరెట్ల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేం దుకు కేటీఅండ్‌జీ, తన లీగల్ భాగస్వామి ఎ స్‌ఎస్ రాణా అండ్ కో అధికారులతో కలిసి ఢిల్లీ ఎస్‌సీఆర్ ప్రాంతంలో ఒకే రోజులో 14 హోల్‌సేల్లర్లపై దాడులు నిర్వహించింది.ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఈ రైడ్స్‌లో ఈఎస్‌ఎస్‌ఈ ట్రేడ్‌మార్క్‌తో విక్రయించబడుతున్న నకిలీ సిగరెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు.
దాడుల సమయం లో పరిశీలించిన పత్రాల్లో ఎక్కడా సక్రమమైన రికార్డు నిర్వహణ లేకపోవడం వెలుగు లోకి వచ్చింది. ఇది నకిలీ వ్యాపారం పూర్తిగా అసంఘటితంగా కొనసాగుతున్నట్టు స్పష్టం చేస్తోంది.ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులపై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేయబడింది.భారతదేశంలోని పలు నగరాల్లో నకిలీ, అక్రమ పొగాకు ఉత్పత్తులు విస్తరిస్తున్న నేపథ్యంలో, కేటీఅండ్‌జీ దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటిం చింది. ఇందులో భాగంగా త్వరలోనే ముం బయి, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్లలో మరిన్ని ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేప ట్టనుంది.
ఈ సందర్భంగా కేటీఅండ్‌జీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఐపీ డివిజన్ డైరెక్టర్ మిస్టర్ యంగ్-హున్ కిమ్ మాట్లాడుతూ ఇలాంటి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు వినియోగదారుల రక్షణ పట్ల కేటీఅండ్‌జీ నిబద్ధతకు నిదర్శనం. ప్రతి వినియోగదారుడికి అసలైన, నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే అందాలి. ప్రజా రోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే నకిలీ ఉత్పత్తులపై మేము ఎలాంటి రాజీ పడం. ఈఎస్‌ఎ స్‌ఈ ట్రేడ్‌మార్క్ దుర్వినియోగం చేసే వారి పై కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.