20-01-2026 04:52:15 PM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు సెట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం శారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఇది సిట్ విచారణ కాదు... చిట్టి విచారణ అని, విచారణ, కమిషన్ల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నేతలను వేధిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని, తన బురదను అందరికీ అంటించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సింగరేణి బొగ్గుకని టెండర్ల కోసం ఫీల్డ్ విజిట్ ఆప్షన్ పెట్టారని, ఫీల్డ్ విజిట్ చేసిన వారిని రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వ్యవహారాలు బయటకురాగానే డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెడుతున్నారని తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో రాజకీయ జోక్యం లేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఓ బంగారు బాతులా చూస్తోందన్నారు. అసలు పీల్డ్ విజిట్ చేసినట్టు సింగరేణి అప్రూవల్ కూడా ఇవ్వడం లేదని, ఇప్పటికే ఐదారుగురు కలిసి సిండికేట్ అయ్యారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని నిన్న హరీష్ రావు బయట పెట్టారని, అవినీతి బయటపెట్టిన ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు మీ మొత్తం కేబినెట్ నే అసెంబీలో ఫుట్ బాల్ ఆడుకున్నారని, అలాంటాయన ఇలాంటి కేసులకు భయపడతారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.