calender_icon.png 21 September, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

21-09-2025 12:24:48 AM

  1.   2023 ఎన్నికల్లో ఓడించినా బుద్ధిరాలేదు
  2. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి తీరుతాం
  3. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టిన ఇంకా బుద్ధిరాలేదని, రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టే 2023 అసెం బ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి చూపించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొ న్నారు. గ్రూప్1కు అభ్యర్థుల తల్లిదండ్రులకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

శనివారం గాంధీభవన్‌లో మీడియాతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, మాజీ ఎంపీ రవీందర్ నాయక్, ఫిషరీస్ కార్మొరేషన్ చైర్మన్ మెట్టుసాయి, కాంగ్రెస్ నాయకులు సత్యం మాట్లాడారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ మాట్లాడుతూ 2023 ఎన్నికల నోటిఫికేషన్ ముందు రోజు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తెచ్చారన్నారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టు కట్టి తీరుతామన్నారు. మాజీ ఎంపీ రవీందర్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లను రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అమలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోతారని మెట్టు సాయికుమార్ జోస్యం చెప్పారు.