12-12-2025 01:44:47 AM
సర్పంచ్ అభ్యర్థి జూపల్లి రఘుపతిరావు భాగ్యమ్మ
కొల్లాపూర్, నవంబర్ 11: కొల్లాపూర్ ని యోజకవర్గం కుడికిళ్ల గ్రామం అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిచేలా గ్రామానికి కంకణ బద్ధులై పనిచేస్తామని జూపల్లి రఘుపతిరావు భాగ్యమ్మ దంపతులు అన్నారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుచున్న తాను గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. ప్రజల కోరిక మేరకే తాను బరిలో నిలిచానని ప్రజ ల ఆశీర్వాదంతో గత 20 ఏళ్లుగా తామిద్దరం రాజకీయ అనుభవంతో గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు.
సింగిల్ విండో చైర్మన్‌గా తన భర్త జూపల్లి రఘుపతిరావు, సర్పంచ్‌గా తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు ఈసారి గ్రామ సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తే మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బ్యాట్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.