calender_icon.png 26 July, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుడుదుల వెంకన్న

25-07-2025 10:58:40 PM

మంథని,(విజయక్రాంతి): మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుడుదుల వెంకన్న ను నియమిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యాయి. అలాగే మంథని మండలంలోని కన్నాలకు చెందిన ముసుకుల ప్రశాంత్ రెడ్డిని వైస్ చైర్మన్ గా, సభ్యులుగా ఎండి అంకుస్, రేగల రామ్మోహన్ రావు, ఊదరి శంకర్, గాదం పోచయ్య, ఆజ్మీర చంద్రు నాయక్, పన్నాల ఓదెలు,  దూలం సులోచన, లింగంపల్లి నరసింహారావు, రవికంటి వెంకటేష్, ఎల్లంకి శంకర్ లింగంలతో పాటు జిల్లా మార్కెటింగ్ అధికారి, మంథని వ్యవసాయ ఏడి, కమాన్ పూర్ గ్రామ ప్రత్యేక అధికారిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెంకన్న నియామకంతో  మండల కంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తన నియమానికి కృషిచేసిన మంత్రి శ్రీధర్ బాబుకు సోదరుడు శ్రీను బాబుకు వెంకన్న, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.