calender_icon.png 13 May, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక పక్షపాతి నాయిని

13-05-2025 12:00:00 AM

  1. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
  2. నాయిని ఇంటి వద్ద 91వ జయంతి 

ముషీరాబాద్, మే 12: కార్మిక పక్షపాతి నాయిని నరసింహారెడ్డి అని, ఆయన సేవలు  మరువలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ తొలి హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి 91వ జయంతిని ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయిని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు.

లోయర్ ట్యాంక్‌బండ్‌లోని గోశాల వద్ద పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపా ల్ మాట్లాడుతూ.. నాయిని నరసింహారెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు. కార్మిక మంత్రిగా మంత్రిగా పనిచేసే కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి అండగా నిలిచారన్నారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రేటర్ నాయకులు ఎమ్మెల్ శ్రీనివా సరావు, రాష్ట్ర నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ల అధ్యక్షులు కొండా శ్రీధర్‌రెడ్డి, వై శ్రీనివాసరావు, శంకర్ ముదిరాజ్, కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, వల్లాల శ్యామ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.