calender_icon.png 2 July, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

01-07-2025 06:43:30 PM

బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కోనసాగింపు..

అనుమతి లేని డ్రోన్, డిజె సౌండ్స్ పై చర్యలు..

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా..

రామగుండం (విజయక్రాంతి): సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్(Ramagundam Commissionerate) పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Amber Kishore Jha) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని, మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 01 తేదీ నుండి 01-8-25 వరకు ఉంటుందని, పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందన్నారు. (భారతీయ న్యాయ సంహిత) BNS 223,  హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.

డీజే, డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు..

కమిషనరేట్ లోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో డీజే సౌండ్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడిగించమని సీపీ తెలిపారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి  భంగం కలగకుండా,  శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించామని, వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ల్ వినియోగిస్తున్నారని, అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్  వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి ల అనుమతి పొందాలని సూచించారు. ఈ నిషేధాజ్ఞలు 01 తేదీ నుండి 01-08-2025 వరకు ఉంటుందని, పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.

కమిషనరేట్ పరిధిలో సిటీ  పోలీస్ యాక్ట్ అమలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a) నుండి (f), 22 (2) (a) & (b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం తేది 01-07 నుండి  01-08- 2025 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుందని,  రామగుండం కమిషనరేట్  పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి  తీసుకోవాలని, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.