calender_icon.png 4 May, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డెక్కిన ఉపాధి కూలీలు

03-05-2025 12:27:47 AM

బూర్గంపాడు,మే2(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పట్టి నగర్ గ్రామంలో సుమారు 50 మంది ఉపాధి కూలీలు రోడ్డెక్కారు. సంబంధిత అధికారులు కొందరికి పని కల్పించి మరి కొందరికి పని కల్పించడం లేదని రోడ్డెక్కి నిరసన తెలిపారు. కూలీలకు పని కల్పించకుండా ఇబ్బందులు గురి చేస్తున్న సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.