12-01-2026 02:01:22 AM
ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ వద్ద ఘటన
మేడ్చల్, జనవరి 11 (విజయక్రాంతి): ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయివర్ధన్‌రెడ్డి చైనా మాంజాతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన గాయం కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఆ మాంజాను ఉపయోగించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.