calender_icon.png 13 November, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నాకాబంది

13-11-2025 10:12:57 PM

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

మాగనూరు(కృష్ణ): నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దు మక్తల్ నియోజకవర్గం కృష్ణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 10 గంటల నుండి గురువారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు పోలీసు జాగిలాలతో నాకాబంది చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఇతర రాష్ట్రాల సరిహద్దులు కలిగి ఉండడం వలన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంకు వచ్చే నిషేధించబడిన డ్రగ్స్, గాంజాయి ,గుట్కా ,ఇసుక, అక్రమ మధ్యము ,ఇతర మాదకద్రవ్యాలు, పిడిఎస్ రైసు ,వంటి ప్రభుత్వానికి గండి కొట్టే ఏవైనా వస్తువుల అక్రమ రవాణా జరుగకుండా ప్రత్యేక తనిఖీలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

రాత్రి వేళల్లో అక్రమ వ్యాపారాలు చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు, దొంగతనాల నివారణకు నిరంతరము తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎవరు అక్రమ రవాణా లేదా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవు అని ఎస్పీ గారు హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతాల్లో పహారా బలోపేతం చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. రాత్రి తనిఖీల్లో 367 వాహనాలను తనిఖీ చేసి పరిశీలించడం జరిగినది తెలిపారు ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు రెండు వరి ధాన్యముతో వస్తున్న లారీలు ఒక ఇసుక లారీ 200 లీటర్ల డీజిల్ను పట్టుకొని స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క తనిఖీల్లో అదనపు ఎస్పి ఎండి రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సిఐ లు రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, ఎస్సైలు, పోలీసులు ,తదితరులు పాల్గొన్నారు.